VIDEO: శ్రీకాళహస్తిలో చీరకట్టుతో విదేశీ భక్తులు
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శనివారం విదేశీ భక్తులు సందడి చేశారు. జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన 30 మంది ఆలయానికి విచ్చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఆలయంలోని శిల్పకళకు మంత్రముగ్ధులయ్యారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ వారు చీరె, పంచెలతో స్వామివారిని దర్శించుకున్నారు.