VIDEO: నీట మునిగిన ధాన్యంతో రైతుల ఇబ్బందులు
SRCL: తంగళ్ళపల్లి మండలం పెద్ద లింగాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీట మునిగింది. రైతులు నీట మునిగిన ధాన్యాన్ని ట్రాక్టర్లో బయటకు తరలిస్తున్నారు. అకాల వర్షానికి తమ ధాన్యం తడిసి ముద్దాయి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.