VIDEO: వెలిగొండ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేశారన్న మాటలు ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. శుక్రవారం మార్కాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన YCP ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.