యూరియా కోసం రైతుల ఎదురుచూపు

BPT: కర్లపాలెం మండలం చింతాయపాలెంలో రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గురువారం ఉదయం నుంచి లైన్‌లో నిలబడలేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున యూరియా అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో యూరియా పంపిణీకి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు.