యూరియా కొరతకు కారణం ఎవరు?: హరీష్‌రావు

యూరియా కొరతకు కారణం ఎవరు?: హరీష్‌రావు

TG: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా.. లేక ప్రధాని మోదీనా? అని మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ప్రకటన బట్టి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో సేకరించడంలో విఫలమైందా.. లేక కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెబుతోందా అని విమర్శించారు.