ఠాణేలంకలో భారీ శబ్దం కలకలం
కోనసీమ: లంకాఫ్ ఠాణేలంకలో బుధవారం ONGC తనిఖీల సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు బ్లో అవుట్ అని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం కాదని, కేవలం వార్షిక తనిఖీలేనని అధికారులు చెప్పడంతో లంక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆందోళనకు గురి చేయడంపై గ్రామస్థులు మండిపడ్డారు.