వార్నింగ్ ఇచ్చిన గంటలోనే 'అబ్రహం లింకన్'పై దాడి
పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అమెరికా విమాన వాహక నౌక 'USS అబ్రహం లింకన్' లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దాడికి గంట ముందే హెచ్చరించిన ఇరాన్, దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. శాంతి చర్చలు సాగుతున్న వేళ జరిగిన ఈ పరిణామం అగ్రరాజ్యాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని ఇరాన్ ప్రకటించగా.. US వాటిని తోసిపుచ్చింది.