క్రీడలతోనే శారీరక ఆరోగ్యం: మాజీమంత్రి
ADB: క్రీడలతోనే శారీరక ఆరోగ్యం కలుగుతుందని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో శ్రీలక్ష్మి నారాయణస్వామి జాతరని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా ముగింపు పోటీలో ఆయన పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.