పార్టీని మరింత బలోపేతం: డిసీసీ అధ్యక్షుడు
MBNR: జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో కలిసి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, అనుబంధ విభాగాలు, కార్యకర్తల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రమాణ స్వీకారంలో టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనడం ఉత్సాహాన్ని పెంచిందన్నారు.