జిల్లా జైలును పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్

గుంటూరు: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా జైలును సాదారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యవేక్షణ అధికారి కే. రఘుని జైలు నిర్వహణ, సిబ్బంది పనితీరు, ముఖ్యమైన కేసుల్లో ముద్దాయిల వివరాలను, రోస్టర్‌లో ఎంట్రీ చేయడం, వివిధ రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు.