బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BDK: దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం పాల్గొన్నారు. మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానికులు సాలువాతో సత్కరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.