‘బొట్టు తుడిచాడు.. పార్టీ తుడిచిపెట్టుకుపోయింది!’
జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ప్రచారంలో ఓ మహిళ తనకు బొట్టు పెట్టగా, కాస్త పక్కకు రాగానే ఆ తిలకాన్ని తుడిచేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఇటీవల ఎన్నికల ఫలితాల్లో JSP ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో.. 'బొట్టు తుడుపుకున్నారు.. పార్టీ తుడిచిపెట్టుకుపోయింది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.