అధిక ధరలకు ఇసుక... చర్యలు తీసుకోవాలని డిమాండ్

NLG: బహిరంగ మార్కెట్లో అధిక ధరకు ఇసుకను అమ్ముతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ఇసుక వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. ఆన్లైన్లో అవసరమైన వారికి ఇసుక బుక్ కావటం లేదని పేర్కొన్నారు. నల్గొండలో మంగళవారం జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.