ఈనెల 15న రాజాంకు చంద్రబాబు రాక

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 15న రాజాం వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 15న మధ్యాహ్నం 3 గంటలకు రాజాం పురపాలక సంఘం పరిధిలోని అంబేడ్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఉంటుందని రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ తెలిపారు. సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అధికంగా హాజరవుతారని తెలిపారు.