ఏయూ గ్రౌండ్‌లో డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి

ఏయూ గ్రౌండ్‌లో డ్వాక్రా బజార్‌ను ప్రారంభించిన మంత్రి

VSP: ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.