ఈనెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
KMM: తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం(టాస్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఖమ్మం డీఈవో చైతన్య జైనీ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా లేదా 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని సందేశం పంపి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.