ఉదృతంగా ప్రవహిస్తున్న లక్నవరం సరస్సు..

ఉదృతంగా ప్రవహిస్తున్న లక్నవరం సరస్సు..

MLG: గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 32 ఫీట్లకు చేరినట్లు శనివారం నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సరస్సు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి పొంగే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు, స్థానికులు సరస్సులో దిగవద్దని సూచించారు.