రోడ్డు విస్తరణ పనులు పరిశీలన
NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ రోజు ఉదయం పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ.. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్రాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.