224కి చేరిన మృతుల సంఖ్య

224కి చేరిన మృతుల సంఖ్య

గతవారం ఫిలిప్పీన్స్‌ను తాకిన కల్మేగి తుఫాన్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 224కి చేరింది. మరో 127 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ వల్ల దేశవ్యాప్తంగా సుమారు 33 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.