32 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

VZM: విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్ స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 15, కుటుంబ కలహాలు 3, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 11 ఫిర్యాదులు అందుకున్నారు.