'పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలి'

'పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలి'

ELR: గిరిజన సమస్యలు పరిష్కారం కోరుతూ సోమవారం జంగారెడ్డిగూడెం డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య డిమాండ్ చేశారు. వలస ఆదివాసి పిల్లలకు కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.