జిల్లాలో సందడి చేసిన సినీ హీరో

జిల్లాలో సందడి చేసిన సినీ హీరో

NLR: నగరంలో జరిగిన మెగా ఈవెంట్‌కు హాజరైన ఆది పినిశెట్టి స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని శాంతినగర్‌లో దిల్ దివానే ఫేం సినీ హీరో రోహిత్ రెడ్డి నివాసానికి మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.