లోక్ అదాలత్ వాయిదా

పల్నాడు: వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మే 10న జరగాల్సిన మెగా లోక్ అదాలత్ వాయిదా పడింది. కోర్టు సిబ్బంది ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా బుధవారం తెలియజేశారు. తదుపరి మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జూలై 5న యథావిధిగా జరుగుతుందని వారు స్పష్టం చేశారు. రాజీకి అనుకూలమైన కేసుల్లో ఇరుపక్షాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోర్టు సూచించింది.