ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు
CTR: చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. మున్సిపాలిటీల పాలక మండళ్ల గడువు ముగియడంతో, ఆయా మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమితులైన కలెక్టర్ కలెక్టరేట్ ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.