VIDEO: పోలేని గూడెంలో విజయోత్సవ ర్యాలీ
SRPT: చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాదే లింగయ్య ఘన విజయం సాధించడంతో సోమవారం గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. పార్టీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సందడి చేశారు. తమ అభ్యర్థి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.