VIDEO: 'రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి'
కోనసీమ: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మారుటేరులో జరుగుతున్న కిసాన్ మేళాకు తరలి వెళ్తున్న బస్సును ఆయన రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.