'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

KDP: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమయ్యాయని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సైబర్ నేరగాళ్లు విభిన్న రకాలుగా ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తుంటారన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయరాదని సూచించారు. ఎవరికీ ఓటీపీ చెప్పవద్దన్నారు.