VIDEO: లబ్ధిదారులకు ఇళ్లు అందించిన కలెక్టర్
W.G: ఆకివీడు మండలం కుప్పనపూడిలో సామూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని పలువురు లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. అలాగే కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ జుత్తిగ నాగరాజు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు పాల్గొన్నారు.