భారీ వర్షాలతో వరిపైరుకు నష్టం

భారీ వర్షాలతో వరిపైరుకు నష్టం

VZM: వేపాడ మండలం కరకవలస పంచాయతీ కొత్తమారికలో రెండురోజులపాటూ కురిసిన భారీ వర్షాలకు గెమ్మెల శోభనబాబు అనే రైతు వరి చేను పూర్తిగా నాశనం అయ్యింది. అలాగే మండలంలో మరికొందరు రైతులు తమ చేను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అధికారులను కోరారు.