చిట్యాల్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

చిట్యాల్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

NRML: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 102 బైక్‌లు, మూడు ఆటోలు, కారు, టాటా మ్యాజిక్, టెంపో వాహనం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు.