రూ.12,23,500 చెక్కుల పంపిణీ

MDK : నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మొత్తం రూ.12,23,500 నిధులు మంజూరు కాగా ఇందుకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు రాజిరెడ్డి అందజేశారు.