శేషాచలం అడవుల్లో మంటలు

TPT: తిరుమల శేషాచలం అడవుల్లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. తుంబురు తీర్థం పరిసర అటవీ ప్రాంతంలో ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలను అదుపులోకి తేవడానికి టీటీడీ, అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మంటల కారణంగా అటవీ జీవ జాలానికి హానీ కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.