కంకిపాడులో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
కృష్ణా: కంకిపాడు మండలంలో రూ.81 లక్షలతో నిర్మించిన మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరాన్ని మంత్రులు కొలుసు పార్థ సారథి, కొల్లు రవీంద్ర, MLA బోడే ప్రసాద్‌తో కలిసి సోమవారం రాత్రి ప్రారంభించారు. అంతకుముందు కంకిపాడులో రూ.66లక్షలతో నూతనంగా నిర్మించిన CC రోడ్డును వారు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వారు తెలిపారు.