'పై చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి'
MBNR: జడ్చర్ల మండలం మాచారంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇవాళ మండలంలోని పెద్దాయికుంట తండా, మర్రిచెట్టు తండాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నతనంలో చదువులకు దూరం కాకుండా పై చదువులు చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.