మతిస్థిమితం లేని మహిళ మిస్సింగ్.. కేసు నమోదు
NDL: మహానంది సమీపంలోని గోపవరం సెయింట్ ఆన్స్ బుద్ధిమాంద్య పాఠశాల నుంచి మహిళ మిస్సింగ్ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలుకు చెందిన షేక్ మోబీనా(36)కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. ఎవరికైనా కనిపిస్తే మహానంది పోలీస్ స్టేషన్ ఎస్సై నంబర్ 9121101093కు సమాచారం అందించాలన్నారు.