అభివృద్ధి యాత్రలో మరో కీలకమైన మైలురాయి: MLA
BDK: పినపాక నియోజకవర్గ అభివృద్ధి యాత్రలో మరో కీలకమైన మైలురాయి నమోదు అయిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మణుగూరు మండలం వాసవి నగర్‌లో గిరిజన భవన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.35 లక్షల నిధులతో అధునాతన కిచెన్ విశాలమైన డైనింగ్ షెడ్ సీలింగ్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.