రక్తదానం చేసిన పీపీఆర్ గ్రూప్ సభ్యులు

రక్తదానం చేసిన పీపీఆర్ గ్రూప్ సభ్యులు

MHBD: కేంద్రంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన రాధిక డెలివరీ మహిళగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు AB+ పాజిటివ్ రక్తం అవసరమని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పీపీఆర్ గ్రూప్ సభ్యులు, పందెం ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకొని స్వచ్ఛందంగా అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీపీఆర్ సోషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులతో, పాటు రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.