వాటర్ ప్యాకెట్ల వ్యాన్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

గంట్యాడ మండలం లక్కీడాం నుంచి వాటర్ ప్యాకెట్ల లోడుతో బొండపల్లి మండలం రుద్రపాలెం గ్రామానికి బుధవారం మధ్యాహ్నం వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడింది. చిన్నమానాపురం సమీపంలో హఠాత్తుగా ముందు టైరు పేలడంతో పల్టీలు కొట్టి 15 అడుగుల సాగునీటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.