ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి మార్చి 20 వరకు గడువు

నల్గొండ: తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.