జిల్లాలో లక్షలు విలువైన వాహనాలు స్వాధీనం

E.G: జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను పట్టుకుని రూ.19 లక్షలు విలువైన 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ఇవాళ తెలిపారు. కాకినాడ, పిఠాపురంకు చెందిన ఇంటి సురేంద్ర, కామిరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు చేప్పారు. వీరు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారన్నారు.