మహిళపై అడవి దున్న దాడి

MHBD: తునికి ఆకు సేకరణకు అడవికి వెళ్లిన ఓ మహిళా కూలీపై అడివి దున్న దాడి చేసిన ఘటన సోమవారం గంగారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. మామిడిగూడేనికి చెందిన సృజన తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లింది. అడవిలో నుంచి హఠాత్తుగా వచ్చిన అడవి దున్న సృజనపై ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర గాయాలైన బాధితురాలిని ములుగు ఏరియా ఆసుపత్రి తరలించారు.