అందుబాటులో ఈ -క్రాప్ నమోదు జాబితాలు: AO
AKP: రబీ సీజన్లో సాగు చేస్తున్న పంటలకు ఈ -క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల జాబితా కోటవురట్ల మండలంలో గల రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని ఏవో సరోజిని ఇవాళ తెలిపారు. ఈ జాబితా మార్చి 12వ తారీకు వరకు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పొరపాట్లు, తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. తుది జాబితాను ఈనెల 15న ప్రచురిస్తామన్నారు.