VIDEO: విషాదం.. నలుగురు మృతి
అన్నమయ్య: బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి నలుగురు మృతి చెందిన ఘటన పుంగనూరు త్యాగరాజ వీధిలో జరిగింది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో బైక్ సర్వీస్ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చాక రాత్రంతా ఇంజిన్ ఆన్‌లో ఉంచాడు. బైక్ ఉంచిన రూమ్‌లోనే వృద్ధుడు, ముగ్గురు చిన్నారులు నిద్రించడంతో వారు మృత్యువాత పడ్డారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.