వినూత్నంగా వార్డు అభ్యర్థి ఎన్నికల ప్రచారం

వినూత్నంగా వార్డు అభ్యర్థి ఎన్నికల ప్రచారం

SRPT: తుంగతుర్తిలో ఓ వార్డు అభ్యర్థి వినూత్నంగా శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుంగతుర్తిలోని 7వ వార్డుకి చెందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి ఉప్పుల సోమయ్య తనకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తు పోస్టర్‌ను తన సైకిల్‌కు పెట్టుకుని సైకిల్ తొక్కుతూ ఓటర్లను ఆకర్షించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రచారాన్ని వార్డు ప్రజలు ఆసక్తిగా తిలకించారు.