VIDEO: రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు

MDK: చేగుంట మండలంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. వందలాదిమంది రైతులు అర కిలోమీటర్ మేర క్యూ లైన్‌లో నిలబడి యూరియా కోసం వేచి చూస్తున్నారు. ఎకరాకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.