నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఎలమంచిలి మండలంలో సోమవారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రేగుపాలెం, పోతిరెడ్డిపాలెం, రుక్మిణీపురం, నాయనమ్మ పాలెం, పురుషోత్తపురం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.