పోలీసుల అనుమతి తప్పనిసరి: ఎస్సై

ELR: ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠకు ముందే పోలీసు అనుమతి తీసుకోవాలని, భద్రతా చర్యలు పాటించాలని పోలవరం ఎస్సై పవన్ కుమార్ సూచించారు. అసభ్య కార్యక్రమాలు, బలవంతపు విరాళాలు, జూద క్రీడలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిషేధమని, ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని, మీ భద్రతే మా పండగ అని ఆయన ప్రజలను కోరారు.