ప్రజావాణిలో 56 ఫిర్యాదుల స్వీకరణ
జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత తెలిపారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.