ప్రతి పేద కుటుంబానికి గృహం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
E.G: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య అన్నారు. గురువారం రాజమండ్రిలో గృహ నిర్మాణ సంస్థ పనితీరుపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ పథకం ద్వారా గృహనిర్మాణం వేగవంతం చేయాలన్నారు.