కల్వర్టులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం

కల్వర్టులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. తప్పిన ప్రమాదం

అన్నమయ్య: మదనపల్లె బుగ్గ కాలువ వద్ద ఇవాళ నాసిరకం కల్వర్టు కారణంగా నీళ్ల ట్యాంకర్ ట్రాక్టర్ అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి, జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. చిత్తూరు బస్టాండ్ సమీప రోడ్డు మరమ్మతుల కారణంగా వాహనాలన్నీ ఈ కల్వర్టు మీదుగా వెళ్తుండటంతో ఈ  ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.